గుత్తి పట్టణంలోని నమాజ్ కట్ట వీధిలో బుధవారం ఇంటి బయట ఆడుకుంటున్న హేమాంజలి అనే ఐదో తరగతి విద్యార్థినిని కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. ఈ దాడిలో హేమాంజలికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాలికను చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే కుక్కల బెడద ఎక్కువగా ఉందని అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు అధికారులను కోరారు.