గుత్తిలోని కేంద్రీయ విద్యాలయంలో గురువారం ప్రిన్సిపల్ మల్కిసాబ్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 9వ తరగతి విద్యార్థులు డంబెల్ డాన్స్ చేసి అందరినీ అలరించారు. డంబెల్ డాన్స్ టీం లీడర్ హరిహరేశ్వర్ ఆధ్వర్యంలో విద్యార్థులు డంబెల్ డాన్స్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉత్సాహపరిచారు. డంబెల్ డాన్సులో ప్రతిభ కనబరిచిన తొమ్మిదో తరగతి విద్యార్థులకు బహుమతులు అందజేశారు.