గుత్తి మండలం బసినేపల్లి గ్రామ సమీపంలో గురువారం ఆటోను అతివేగంగా వచ్చి బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ గౌస్ తో పాటు బైక్ మీద ప్రయాణిస్తున్న అవినాష్, శాన్వాజ్ కు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించగా అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.