గుత్తి: ఒకరిపై ఒకరు రాళ్ల దాడి ఇద్దరికీ తీవ్ర గాయాలు

73చూసినవారు
గుత్తిలో ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకున్న ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. గుత్తి పట్టణంలోని బీసీ కాలనీలో నివసించే విజయ్ కుమార్, లక్ష్మి అనే ఇద్దరు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. స్థానికులు గమనించి గాయపడిన ఇద్దరిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘర్షణకు సంబంధించిన కారణాలు తెలియరాలేదు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్