గుత్తి: రైలులో నుంచి జారిపడి మహిళకు గాయాలు

55చూసినవారు
గుత్తి రైల్వే స్టేషన్ పరిధిలోని ఎస్ఎస్ పల్లి గేటు వద్ద రైలులో నుంచి జారి కిందపడి నాగరత్నమ్మ అనే మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన శుక్రవారం ఉదయం జరిగింది. పీలేరుకు చెందిన నాగరత్నమ్మ డోర్ వద్ద నిలబడింది. ఆ సమయంలో ప్రమాదవశాత్తు జారి కింద పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను గుత్తి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్