గుత్తి మండలం ఊటకల్లు గ్రామంలో గురువారం ఉదయం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సమావేశం నిర్వహించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆర్డీటీ సంస్థ ఏటీఎల్ నారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ చేశారు. ఎటీఎల్ నారాయణ మాట్లాడుతూ, మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్నారు. సీవో నాగమణి, సీబీటి రిబకమ్మ పాల్గొన్నారు.