అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని తొండపాడు శ్రీ బొలికొండ రంగనాథ స్వామి దేవాలయం హుండీ లెక్కింపు ప్రారంభమైంది. ఆలయ ఈ ఓ రామాంజినేయులు మరియు ధర్మకర్తల అధ్వర్యంలో స్థానిక పాఠశాలలోని విద్యార్థి, విద్యార్ధినుల చే హుండీ లెక్కింపు ప్రారంభించారు. గడిచిన ఆరు మాసాలకు గాను హుండీ లెక్కింపు చేస్తున్నట్లు ఈ ఓ తెలిపారు.