గుత్తి ఆర్ఎస్ లో శనివారం దక్షిణ మధ్య మజ్దూర్ యూనియన్ నాయకులు రైల్వే సంఘాల గుర్తింపు ఎన్నికలకు సంబంధించి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. యూనియన్ డివిజనల్ సెక్రెటరీ విజయ్ కుమార్, ఏడీఎస్ లు నారాయణ, అశ్వని ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. డీజిల్ షెడ్, రైల్వే బుకింగ్ కార్యాలయం తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డిసెంబర్ 4, 5, 6 తేదీల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతుందన్నారు.