గుత్తి మండలం చెర్లోపల్లి పంచాయతీలోని సేవా గడ్ లో ఈనెల 27న జరిగే సేవాలాల్ అఖండ జ్యోతి యాత్రను జయప్రదం చేయాలని బంజారా ఫౌండేషన్ చైర్మన్ కమల్ సింగ్ రాథోడ్ కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ దేవాలయంలో అఖండ జ్యోతి యాత్ర కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. బంజారాలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.