గుత్తి పట్టణంలోని హజరత్ సయ్యద్ వలి భాషా ఖాద్రీ రహమతుల్లా అలైహి 677వ ఉర్సు ఉత్సవాలు ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం నిషాన్ జండా, సోమవారం గంధం, మంగళవారం ఉరుసు, బుధవారం జియారత్ తో ఈ ఉర్సు ఉత్సవాలు ముగుస్తాయని దర్గా కమిటీ అధ్యక్షుడు కేఎస్ ఉమర్, కేఎస్ మైను మీడియాకు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.