భార్యపై భర్త దాడి-పరిస్థితి విషమం

50చూసినవారు
భార్యపై భర్త దాడి-పరిస్థితి విషమం
గుత్తి మండలం అబ్బేదొడ్డి గ్రామంలో కుటుంబ కలహాల కారణంగా సుమలతపై ఆమె భర్త గోపాల్ దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. చిన్నపాటి విషయంపై భార్యాభర్తల మధ్య గొడవ ప్రారంభమైంది. కోపంతో గోపాల్ భార్యపై దాడి చేశాడు. స్థానికులు గమనించి వెంటనే సుమలతను గుత్తి ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కొరకు అనంతపురం రెఫర్ చేశాడు. ఈ సందర్భంగా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్