అనంతపురం జిల్లా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పామిడి మండలం కాలాపురం గ్రామానికి వెళ్లే వంతెన కోతకు గురైంది. గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆదేశాలతో కోతకు గురైన వంతెన నిర్మాణ పనులకు స్థానిక టీడీపీ నాయకులు గురువారం పరిశీలించారు. అనంతరం వంతెనకు తాత్కాలిక మరమ్మత్తు పనులు చేపట్టారు. త్వరలోనే వంతెన నిర్మాణం పూర్తి అవుతుందని టీడీపీ నాయకుడు ఆర్ఆర్ రమేష్ తెలిపారు.