కణేకల్ వ్యవసాయ శాఖ కార్యాలయంలో సబ్సిడీ వేరుశనగ విత్తనాల పంపిణీ సోమవారం ప్రారంభమైంది. క్లస్టర్ ఇన్‌చార్జి ఆనంద్ రాజు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ చాంద్ బాషా చేతుల మీదుగా ఈ కార్యక్రమం మొదలైంది. మండలానికి 2100 క్వింటాళ్లు మంజూరు అయ్యాయి. రైతులు తమ పరిధిలోని రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.