గుత్తి పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో శుక్రవారం ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎల్లా రాముడు ఆధ్వర్యంలో డ్రై డే ఫ్రైడే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం డ్రమ్ములో నిల్వ ఉన్న నీటిని పారబోశారు. ఎక్కువ రోజులు డ్రమ్ములో నీటిని నిలువ చేస్తే డెంగ్యూ దోమలు వృద్ధి చెందుతాయని ప్రజలకు సూచించారు. పరిసప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. ఏఎన్ఎంలు , ఆశ వర్కర్లు పాల్గొన్నారు.