రక్తదానంపై అపోహలు వీడాలి: సీఐ

79చూసినవారు
రక్తదానంపై అపోహలు వీడాలి: సీఐ
పామిడి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జన విజ్ఞాన వేదిక, ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పామిడి సీఐ యుగంధర్, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ హరి ప్రసాద్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థి దశ నుంచే రక్తదానం మీద అపోహలు వీడి రక్తదానం చేయాలని వారు విద్యార్థులకు సూచించారు.

సంబంధిత పోస్ట్