గుంతకల్లు రైల్వే డిఆర్ఎంను ఆదివారం జిల్లా ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మర్యాదపూర్వకంగా కలిశారు. డిఆర్ఎంతో సమావేశమై రైల్వే డివిజన్ లోని అభివృద్ధి పనులపై చర్చించి, పెండింగ్ లో ఉన్న పనులను వెంటనే ప్రారంభించాలని కోరారు. డివిజన్ లోని పలు సమస్యలపై డిఆర్ఎంకు ఎంపీ, ఎమ్మెల్యే వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.