అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని R&B అతిథి గృహంలో వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ బుధవారం ఉదయం మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా తనిఖీ చేశారు. ప్రజలకు అల్పాహారం వడ్డించారు. అనంతరం అన్న క్యాంటీన్ నిర్వాహకులకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలని తెలిపారు.