పామిడి దత్తాత్రేయ దేవాలయంలో నవగ్రహ విగ్రహాలు ప్రతిష్ఠ

71చూసినవారు
పామిడి పట్టణంలోని అనఘాత్రేయ దత్త పాదుక క్షేత్రంలో (దత్తాత్రేయ ఆలయంలో) నూతనంగా తయారు చేయించిన నవగ్రహ విగ్రహాల ప్రతిష్ఠా కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మైసూరు దత్త పీఠం పురోహితులు శంకర దత్త శర్మ బృందం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు కలశ స్థాపన, మండప ఆరాధన, నవగ్రహ మూల మంత్ర జపం, హోమాలు నిర్వహించనున్నారు. నవగ్రహ విగ్రహాలు ఆయా గ్రహ వాహనాలు, ఆ దేవతమూర్తుల సతీమణులతో సహా ప్రతిష్ఠించడం ఇక్కడి ప్రత్యేకత.

సంబంధిత పోస్ట్