గుంతకల్లులో క్షుద్ర పూజల కలకలం రేగింది. నిత్యం రద్దీగా ఉండే 60 ఫీట్ రోడ్డు పక్కన ఉన్న రామచంద్రప్ప ఇంటి ముందు ముగ్గు వేసి బొమ్మను పెట్టి క్షుద్ర పూజలు నిర్వహించినట్లు స్థానికులు గమనించారు. ఆదివారం ఉదయం ఈ సంఘటనను చూసి రామచంద్రప్ప పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.