పామిడి పట్టణ శివారులోని పెన్నా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను గురువారం పోలీసులు సీజ్ చేశారు. స్థానిక సీఐ యుగేందర్ మాట్లాడుతూ పెన్నానది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని తమకు రాబడిన సమాచారంతో తమ సిబ్బందితో కలిసి ఈ దాడులు నిర్వహించామన్నారు. అందులో భాగంగా ఇసుక తరలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు.