పామిడి: ఉచిత మెగా కంటి వైద్య శిబిరం

68చూసినవారు
పామిడి పట్టణ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం బీకే కల్యాణమండపంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. బెంగుళూరు శంకర కంటి ఆసుపత్రి బృందం 156 మంది పరీక్షించి, 96 మందిని శస్త్రచికిత్సల కోసం ఎంపిక చేసింది. డాక్టర్ క్రతేక వీరిని ఎంపిక చేశారు. క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు తిరుపతి నాయుడు మాట్లాడుతూ ఇప్పటివరకు 9 వేల మందికి శస్త్రచికిత్సలు నిర్వహించామని తెలిపారు. శిబిరానికి వచ్చినవారికి భోజన సౌకర్యం కూడా అందించారు.

సంబంధిత పోస్ట్