లాభపేక్ష లేకుండ సనాతన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, నైతిక విలువలను విద్య తో పాటు వెదజల్లుతున్న పామిడి సరస్వతి విద్య మందిరం పాఠశాలకు రూ. 5లక్షలు భారీ విరాళం అందించారు. మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా, అయన సోదరుడు పారిశ్రామిక వేత్త కొట్రికే శ్రీహరి పాఠశాల కమిటీ సభ్యలకు చెక్కు అందించారు. కమిటీ సభ్యులు రత్నమయ్య, బొల్లు శ్రీనివాసరెడ్డి, బాలానగరాజు, బసవరాజు, అమర్ నాథ్ ఇతరులు వారిని సత్కరించారు.