పామిడి పట్టణంలోని పురాతన భోగేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. చైత్రమాసం మూడవ సోమవారం సందర్బంగా ప్రాతఃకాల అభిషేకం జల, రుద్ర, పుష్ప, బిల్వ, రుద్రాక్ష, సుఘంధ ద్రవ్య, పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం భక్తుల ముందు అష్టోత్తరపూజలు చేశారు. మహామంగళ హారతి గావించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఓం నమఃశివాయ నమోత్సరణతో ఆలయం మర్మోగింది.