బంగారు పతకం అందుకున్న పామిడి విద్యార్థిని

77చూసినవారు
బంగారు పతకం అందుకున్న పామిడి విద్యార్థిని
పామిడి పట్టణ భావసర్ క్షత్రియ సమాజ్ కు చెందిన మహేంద్రకర్ శ్రీనివాసరావు రమాబాయి దంపతుల కుమార్తె మహేంద్రకర్ ధృతిక భాయ్ ( ఏపీఆర్జేసీ బనవాసి గురుకుల జూనియర్ కళాశాల ఎమ్మిగనూరు) ఇంటర్ ఫలితాలలో 987 మార్కులతో ఎంపీసీ గ్రూపు నందు కర్నూల్ జిల్లాలోనే మొదటి స్థానం సాధించింది. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నందు మహేంద్రకర్ ధృతీక బాయిని సన్మానించి గోల్డ్ మెడలు, లాప్టాప్ బహూకరించారు. ధృతీక బాయ్ తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్