విద్యార్థులకు రైమ్స్ ద్వారా బోధన అందించాలని శనివారం పామిడి మండల పరిధిలోని గజరాంపల్లి గ్రామంలో గల అంగన్వాడి కేంద్రంలోని అంగన్వాడి కార్యకర్తలకు అడిషనల్ సిడిపిఓ నాగమణి సూచించారు. వారు మాట్లాడుతూ అంగన్వాడీ విద్యార్థులకు రైమ్స్ ద్వారా బోధన అందించాలని అలాగే వారి హాజరు శాతాన్ని పెంచాలని ప్రార్ధన సమయానికి హాజరయ్యేలా చూడాలని తెలిపారు. అనంతరం ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్నారు.