పామిడి పట్టణంలోని బారా ఇమామ్ పీరు గ్రామంలో ముహర్రం 8వ రోజున ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. శనివారం రాత్రి 11 గంటలకు పీరును నగలు, పూలమాలలు, కొత్త వస్త్రాలతో అలంకరించి, డప్పులు, భజంత్రులతో ఊరేగింపు చేశారు. యువకులు ఆనందంగా పాల్గొన్నారు. అనంతరం అన్ని మాకనాల్లో దర్శనాలు చేసి చదివింపులు చేశారు.