గుంతకలు తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో తహశీల్దార్ రమాదేవికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు శ్రీనివాసులు మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగకు చౌక ధాన్యపు దుకాణాలలో సంక్రాంతి కానుక ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. గతంలో సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ పండగలకు కానుకలు ఇచ్చే వారిని, అదే విధంగా కూటమి ప్రభుత్వంలో కూడా కానుకలు ఇవ్వాలని అన్నారు.