పామిడి మండలం రామగిరి గ్రామంలో ఆదివారం జరుగుతున్న దేవర పూజ కార్యక్రమానికి గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, పామిడి గుత్తి ఇన్‌ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర హాజరయ్యారు. ముందుగా గ్రామస్థులు, టీడీపీ నాయకులు ఎమ్మెల్యేకు స్వాగతించారు. అనంతరం ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.