రామరాజు పల్లి వద్ద కుంగిపోయిన వంతెన

62చూసినవారు
రామరాజు పల్లి వద్ద కుంగిపోయిన వంతెన
పామిడి మండలం రామరాజు పల్లి గ్రామ సమీపంలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వంతెన కుంగిపోయింది. దీంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. 44వ జాతీయ రహదారి నుంచి రామరాజు పల్లి గ్రామానికి వెళ్లే మార్గ మధ్యలో ఉన్న వంతెన కుంగిపోయింది. దీంతో రామరాజు పల్లి నుంచి జాతీయ రహదారిపై రావడానికి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వంతెనకు వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్