గుత్తి అనంతపురం రోడ్డులోని విరుపాక్షి రెడ్డి ఫంక్షన్ హాల లో ఈ నెల 11వ తేదీన సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి మహబూబ్ బాషా చెప్పారు. శనివారం ఆయన మాట్లాడారు. 11వ తేదీ ఉదయం 9 గంటలకు ముగ్గుల పోటీలు ప్రారంభమవుతాయన్నారు. ఆసక్తి ఉన్నవారు ముగ్గుల పోటీల్లో పాల్గొనవచ్చునన్నారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తామన్నారు.