గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో నూతన గోశాల ఏర్పాటుకు ఆలయ ఈవో వాణి స్థలాన్ని మంగళవారం పరిశీలించి కొలతలు వేశారు. అనంతరం కసాపురం ఆలయ పరిధిలోని భూములను ఆమె పరిశీలించారు. ఆలయ అభివృద్ధికి గ్రామస్తులు సహకారం అందించాలన్నారు.