గుత్తిలోని ఆస్పత్రి ఎదురుగా ఉన్న పోలీస్ క్వార్టర్స్ ను జిల్లా ఎస్పీ జగదీశ్ శనివారం సాయంత్రం పరిశీలించారు. అదేవిధంగా త్వరలో ఏర్పాటు కాబోతున్న పెట్రోల్ బంక్ స్థలాన్నీ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ గుత్తిలో ట్రాఫిక్ సమస్యను, పోలీస్ సిబ్బంది కొరతను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఓపెన్ డ్రింకింగ్ పై డ్రోన్ కెమెరాలతో నిఘా వేసి ఉంచామన్నారు.