గుత్తిలోని స్పెషల్ సబ్ జైలును బుధవారం డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ శివప్రసాద్ యాదవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయనలోని బ్యారెక్ లు, వంటగది, స్టోర్ రూమ్, టాయిలెట్స్, బాత్రూమ్స్ పరిశీలించారు. ఖైదీలతో ముఖాముఖి మాట్లాడారు. 70 ఏళ్లకు పైబడిన వారు, అనారోగ్యానికి గురైన వారు ఉన్నారా అని ఆరా తీశారు. అలాంటి వారు ఉంటే మండల లీగల్ సర్వీసెస్ కు తెలియజేయాలన్నారు.