గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయ పరిసరాల ప్రాంతాలలో స్వచ్ఛతాహి సేవ స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం దేవస్థానానికి సంబంధించిన వసతి గదుల పైకప్పులను శుభ్రం చేస్తున్న పనులను ఆలయ ఈవో భద్రాజి పరిశీలించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఈ పనులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, శ్రీ హనుమాన్ సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.