గుంతకల్లు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆదివారం ముక్కుపుడక సీరియల్ నటీ నటులు సందడి చేశారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ కమిటీ సభ్యులు వారిని స్వాగతం పలికారు. ఆలయంలో సీరియల్ కు సంబంధించిన పలు సన్నివేశాలను చిత్రీకరించారు. బుల్లితెర నటీనటులతో ఫోటోలు దిగేందుకు ప్రజలు ఎగబడ్డారు.