శ్రీసత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండలంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆదివారం కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వంద రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందిచడం జరిగిందన్నారు.