గుంతకల్లు పట్టణ శివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ఇసుక ట్రాక్టర్లను శనివారం రూరల్ పోలీసులు పట్టుకున్నారు. రూరల్ ఎస్సై రాఘవేంద్ర మాట్లాడుతూ పామిడి నుంచి ఎలాంటి అనుమతి లేకుండా గుంతకల్ కు ఇసుక తరలిస్తున్నారన్న సమాచారం రావడంతో తమ సిబ్బందితో కలిసి ఈ దాడులను నిర్వహించామన్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు.