గుంతకల్లులో ట్రాఫిక్ సమస్యను పరిష్కారం చేయాలని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కోరారు. ఆదివారం గుంతకల్లు పట్టణంలో పెద్ద ట్రాఫిక్ సమస్యగా ఉన్న కసాపురం రైల్వే అండర్ పాస్ ను, రైల్వే ట్రాక్ ను ఎంపీ, ఎమ్మెల్యేలు పరిశీలించారు. ఆ తరువాత గుంతకల్లు రైల్వే డిఆర్ఎం దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లి ట్రాఫిక్ సమస్యను పరిష్కారం చేయాలని కోరారు.