గుత్తిలో రోజురోజుకు ట్రాఫిక్ సమస్య పెరుగుతోంది.
శుక్రవారం ఉదయం భారీ వాహనాలు గుంతకల్లు వైపునకు వెళ్తున్న సమయంలో గాంధీచౌక్ వద్ద భారీ వాహనాలు నిలిచిపోవడంతో కాసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గుత్తిలో ట్రాఫిక్ సమస్య లేకుండా తగు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు అధికారులను కోరారు.