వైసీపీ గుత్తి పట్టణ కన్వీనర్‌గా నియమితులైన క్రషర్ మధుసూదన్ రెడ్డిని శనివారం రాత్రి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. శాలువాలు, పూలమాలలతో సత్కరించి, కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు, యువజన విభాగం కార్యకర్తలు పాల్గొని, "జై జగన్" నినాదాలతో ప్రాంగణాన్ని మార్మోగించారు.