గుంతకల్లు కుమ్మరి సంఘం అధ్యక్షుడు అంజి ఆధ్వర్యంలో గురువారం కవయిత్రి మొల్లమాంబ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ఇన్ఛార్జి నారాయణస్వామి, మండల తహశీల్దార్ రమాదేవితో కలిసి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తహశీల్దారు మాట్లాడుతూ మహిళలకు ఆమె జీవితం ఒక మార్గదర్శకమన్నారు. వాల్మీకి రచించిన రామాయణాన్ని అందరికి అర్థమయ్యేలా తెలుగు భాషలో రామాయణం రచించారని అన్నారు.