బీజేపీ గుత్తి పట్టణ అధ్యక్షుడిగా వెంకప్ప ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షులు సంధిరెడ్డి శ్రీనివాసులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణ అధ్యక్షుడిగా ఎంపికైన వెంకప్పకు పలువురు నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని వెంకప్ప అన్నారు.