అక్రమ కట్టడాలను వారం రోజులలో తొలగిస్తామని గుత్తి మండల తాసిల్దారు ఓబులేసు గురువారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుత్తి సబ్ రిజిస్టర్ కార్యాలయం ఆవరణ సమీపంలో 17 మంది అక్రమంగా వేసిన షెడ్లను తొలగిస్తామన్నారు. ఆక్రమణదారులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే కోర్టు సమీపంలో ఉన్న అక్రమ కట్టడాలను కూడా తొలగించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.