పురాతన పామిడి భోగేశ్వర స్వామి దేవాలయంలోని వినాయకునికి శుక్రవారం సంకట హర చతుర్థి వ్రతం ఈవేళ భక్తుల సమక్షంలో చేశారు. వైశాఖ మాసం బహుళ చతుర్థి ప్రాదోశ కాలంలో ఈవ్రతం ఆచరించారు. ఈ సందర్బంగా స్వామివారికి సర్వ అభిషేకాలు చేశారు. ఎకవింశతి పత్ర పూజలు, గరిక పూజ, పుష్ప అష్టోత్తరపూజలు అర్చన చేశారు. కథ శ్రవణం గావించి మంగళ హారతి గావించి తీర్థ ప్రసాదాలు అందించారు.