లేపాక్షి మండల పరిధిలోని పులమతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెడ్ మాస్టర్ సుబ్బారావు ఆధ్వర్యంలో నాలుగు రోజులు ఆధార్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఆధార్ కి సంబంధించిన మార్పులు చేసుకోవాలంటే పులమతి జడ్పీహెచ్ హై స్కూల్ లో నిర్వహిస్తున్న క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు, డిజిటల్ అసిస్టెంట్ శ్రీనివాసులు మంగళవారం తెలియజేశారు.