చిలమత్తూరు మండల తహసీల్దార్ ఆనంద్ కుమార్ ఉత్తమ తహసీల్దార్ గా సబ్ కలెక్టర్ భరత్ నుంచి అవార్డు అందుకున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈ అవార్డు అందుకున్నారు. ఆయనతో పాటు ఇదే కార్యాలయంలో పనిచేస్తున్న డీటీ యూనస్, జూనియర్ అసిస్టెంట్ శంకర్లకు ఉత్తమ సేవా అవార్డు అందింది. కార్యాలయ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.