శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం ఆర్టీసీ డిపోలో నూతనంగా మూడు ఎక్స్ ప్రెస్ బస్సులను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ బస్సులకు రిబ్బన్ కట్ చేసి స్వయంగా బస్సులను నడిపారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.