కలెక్టర్,ఎస్పీలను కలిసిన లేపాక్షి ఆలయ చైర్మన్

65చూసినవారు
కలెక్టర్,ఎస్పీలను కలిసిన లేపాక్షి ఆలయ చైర్మన్
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండలంలో ప్రసిద్ధి చెందిన శ్రీ దుర్గా వీరభద్ర స్వామి ఆలయంలో జరిగే శరన్నవరాత్రులు సందర్భంగా.. మంగళవారం లేపాక్షి ఆలయ కమిటీ చైర్మన్ కరణం శ్రీ రమానందన్ జిల్లా కలెక్టర్ టీ.ఎన్. చేతన్, జిల్లా ఎస్పీ వి.రత్నను పుట్టపర్తిలోని వారి వారి కార్యాలయాలలో మర్యాదపూర్వకంగా కలిసారు. విజయదశమి పండుగ సందర్బంగా శరన్నవరాత్రులు పూజా కార్యక్రమాలకు ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్