సోమఘట్ట, కోడూరు, చిలమత్తూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొసైటీ బ్యాంకు నందు ఓటు హక్కు కలిగిన రైతులు సచివాలయాల వద్ద ఈకేవైసీ చేయించుకోవాలని ఇన్ ఛార్జ్ వన్నూరు స్వామి, అమర్నాథ్, చిలమత్తూరు మండలంలో ఉన్న సంఘం సీఈవోలు సోమవారం తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కంప్యూటరీకరణలో భాగంగా ఈకేవైసీ చేసుకుంటే ప్రభుత్వం అందించే ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ లు, వడ్డీ రాయితీలు వర్తిస్తాయన్నారు.