చిలమత్తూరు మండల పరిధిలోని కొడికొండ చెక్ పోస్టులో ఎస్ఐ మునీర్ అహ్మద్ ఆధ్వర్యంలో శుక్రవారం డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై మునీర్ అహ్మద్ పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వార అత్యదికంగా ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి, హెల్మెట్ లేకుండా వాహనాన్ని నడిపిన వారికి జరిమానా విధించారు.